
కవి నూనె రమేష్‌కు జాతీయ యువకీర్తి పురస్కారం
వీఆర్‌పురం: ఏలూరులోని మహలక్ష్మి గోపాలస్వామి కల్యాణ మండపంలో ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించిన శ్రీశ్రీ కళావేదిక సాహితీ పట్టాభిషేక మహోత్సవాల్లో మన్యం కవి నూనె రమేష్‌కు జాతీయ యువకీర్తి ప్రతిభా పురస్కారం లభించింది. సాహితీ సంబరాల్లో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా రమేష్‌ను ప్రసిద్ధ గాయకుడు గజల్ శ్రీనివాస్, కళావేదిక అంతర్జాతీయ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్, అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి, జాతీయ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం. చిట్టె లలిత, సాహితీ సంబరాల కన్వీనర్, పార్థసారధి, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు సత్కరించారు. ఆయనను పలువురు అభినందించారు.