
ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ట
రాజవొమ్మంగి: మండలంలోని చికిలింత పంచాయతీ వెంకటనగరంలో ఆదివారం జరిగిన శ్రీసీతారాముల విగ్రహప్రతిష్ట మహోత్సవాన్ని పురోహితులు ఈమని సత్యన్నారాయణ, నరశింహామూర్తి వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ముందుగా అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం స్వామి వారిని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోండ్ల సూరిబాబు, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శింగిరెడ్డి రామకృష్ణ, వైస్ ఎంపీపీ రాజేశ్వరి, కమిటీ సభ్యులు అబ్బాయిరెడ్డి, శ్రీను, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.