
వాటర్ స్పోర్ట్స్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
కొమ్మాది: రుషికొండ బీచ్‌లో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనాయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో శుక్రవారం వాటర్ స్పోర్ట్స్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శాప్ చైర్మన్ రవినాయుడు ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. విశాఖను వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి వేదికగా మారుస్తామన్నారు. ఇందుకోసం అత్యుత్తమ క్రీడా వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని, అంతర్జాతీయస్థాయిలో రాణించాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో కెనాయింగ్, కయాకింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు.