
భారత సైనికులకు మద్దతుగా సంఘీభావ యాత్ర
విశాఖ లీగల్ : భారత సైనికుల వీరోచిత పోరాటానికి సంఘీభావంగా విశాఖ న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ప్రధాన గేట్ నుంచి జగదాంబ వరకు ప్రదర్శన నిర్వహించారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సంఘీభావ ప్రదర్శన అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామాంజనేయులు మాట్లాడుతూ భారత సైన్యం శత్రుసేనపై చేస్తున్న పోరాటానికి తాము జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నూకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న సింధూర పోరాటానికి న్యాయవాదులందరూ సంఘీభావం ప్రకటించారన్నారు. కార్యక్రమంలో వందలాదిగా న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే కోర్టు ప్రధాన గేటు దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామాంజనేయరావు, వెంకటేశ్వరరావు, అల్లు సురేష్, మణి, భవాని, శ్రీధర్, చిట్టిబాబు, శ్రీరామ్ముర్తి, ఆనందరెడ్డి, ఎస్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.