
ఎన్‌ఎంయూ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
ఎంవీపీకాలనీ : వాల్తేర్ ఆర్టీసీ డిపో ఎన్‌ఎంయూ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఆ సంస్థ డిపో చైర్మన్ బండి రవి తెలిపారు. గురువారం రాత్రి డిపో ఆవరణలో ఉన్న తమ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఫర్నిచర్, కార్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కార్యాలయం సిబ్బంది వచ్చి చూడగా పరిసరాలు చిందరవందరగా ఉండటంతో కుర్చీలు, ఇతర ఫర్నీచర్ వస్తువులు ధ్వంసమై ఉన్నాయన్నారు. ఫ్లెక్సీని సైతం చించేశారన్నారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఎన్‌ఎంయూ డిపో యాజమాన్యంపై అక్కసుతోనే ఈ దాడికి పాల్పడినట్లు సంస్థ డిపో కార్యదర్శి వసంతరావు పేర్కొన్నారు.