
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
మాకవరపాలెం: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాకవరపాలేనికి చెందిన లంక గణేష్(26) ఆరేళ్ల క్రితం తూటిపాలకు చెందిన శీరంరెడ్డి సుధారాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గణేష్ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులుగా గణేష్ అత్తగారిల్లు అయిన తూటిపాలలోనే ఉంటున్నాడు. గురువారం మాకవరపాలెం వచ్చి మళ్లీ సాయంత్రం తూటిపాల వెళ్లాడు. శుక్రవారం ఉదయం సమీప జీడితోటలో ఉరివేసుకుని మరణించి కనిపించాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఎస్‌ఐ దామోదర్‌నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మృతుడి తల్లి నూకరత్నం ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఐదేళ్ల ఏళ్ల కుమారుడు ఉన్నారు.