
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె
● నేటి నుంచి ఉత్సవాలకు అంకురార్పణ ● ముస్తాబైన పెందుర్తి వెంకటాద్రి
పెందుర్తి: బ్రహ్మాండ నాయకుడు కొలువుదీరిన పెందుర్తి వెంకటాద్రి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైశాఖ శుద్ధ దశమి ఎంతో పవిత్రమైన రోజు. శ్రీనివాసుడు పద్మావ తి అమ్మవారిని వివాహమాడేందుకు భూమిపై అడుగుపెట్టిన ఈ శుభ ముహూర్తాన, వెంకటా ద్రి నిర్మాణానికి తొలి అంకురార్పణ జరిగింది. ఈ నేపథ్యంలో, ఏటా వైశాఖ శుద్ధ దశమి నాడు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. సోమవారం నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఉత్సవాల తొలి రోజు విష్వక్సేన పూజ, అంకురార్పణతో వేడుకలు ప్రారంభమవుతాయి. మంగళవారం ఉదయం ధ్వజారోహణ, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. సాయంత్రం లక్ష తులసి, మల్లికా పుష్పాలతో స్వామివారికి విశేష అర్చనలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం, వైశాఖ శుద్ధ దశమి అయిన బుధవారం సాయంత్రం శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. గురువారం సాయంత్రం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగుతుంది. వెంకటాద్రి నుంచి పెందుర్తి పురవీధుల్లో రథంపై ఊరేగు తూ, చినముషిడివాడ సప్తగిరినగర్‌లోని అలివేలు మంగమ్మ సన్నిధి వరకు స్వామివా రు భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదిస్తారు. శుక్రవారం ఉదయం చక్రస్నానం, చక్రత్తాళ్వా రులతో కలిసి స్వామివారు దివ్య స్నానమాచరిస్తారు. సాయంత్రం పుష్పయాగం, మహా పూర్ణాహుతి, ద్వాదశారాధన, ప్రత్యేక అర్చనలు, ఊంజల్ సేవతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి అని ఆలయ ప్రతినిధులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల కోసం ఆలయ ప్రాంగణమంతా ప్రత్యేకం గా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె