
గురుకుల ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణ
సీతంపేట (విశాఖ): ఆంగ్ల ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంపొందించే దిశగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం శంకరమఠం రోడ్డులోని ఒక హోటల్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా సొసైటీ డీసీవో డాక్టర్ సి.ప్రభావతమ్మ మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయుల్లో ఇంగ్లిష్ బోధనా సామర్థ్యం మెరుగుపర్చడానికి ముంబైకి చెందిన కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌తో ఎంవోయూ చేసుకున్నట్టు తెలిపా రు. కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, ఫ్యూచర్ రెడీనెస్ అంశంపై మూడు రోజుల శిక్షణ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గురుకుల ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ ఎన్.రామకృష్ణ, కోటక్ ఫౌండేషన్ ప్రతినిధులు నూథన్, ఫర్జిత్ పంతక్, జ్యోతి శిక్షణ ఇచ్చారు.