
మత్స్యమాడుగులమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం
జి.మాడుగుల: మండల కేంద్రంలో గంత కొండపై కొలువైన శ్రీమత్స్య మాడుగులమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మాజీ ఎంపీ దివంగత మత్స్యరాస మత్స్యరాజు స్వగృహం నుంచి మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, ఎం.మణికుమారి, భక్తులు కలసి డప్పు వాయిద్యాల నడుమ ఘటాలను, పూర్వీకులు వినియోగించిన నాటుతుపాకీ, ఖడ్గాన్ని ఊరేగింపుగా సతకంపట్టు వద్దకు తీసుకువెళ్లి ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస రామరాజు, ప్రధాన కార్యదర్శి గసాడి రెడ్డిబాబు, మాజీ ఎంపీపీ, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు మత్స్యరాస వెంకటగంగరాజు (బుజ్జి), మాజీ ఎంపీపీ వరహాలమ్మ, ఎంపీటీసీ మత్స్యరాస విజయకుమారి, పాడేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ ఎం.గాయత్రి, సొలభం సర్పంచ్ హనుమంతరావు,హెల్త్ అసిస్టెంట్ ఎం లక్ష్మీపతిరాజు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు నాగరాజు, అర్జునరావు, గిరిజన పూజారి కిముడు శివందొర తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జాతర
అడ్డతీగల: మండలంలోని వేటమామిడిలో వేంచేసిన శ్రీ చిన్నమస్తా రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.ఆలయ ప్రధాన అర్చకుడు ముర్ల రాజారెడ్డి ఆధ్వర్యంలో వేకువజామునే శ్రీ చిన్నమస్తా రేణుకా ఎల్లమ్మ, దక్షిణ కాశీ అమ్మవార్లకు, కదంబ ఈశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు. క్షేత్ర ఆవరణలో దేవతలు, క్షేత్ర శక్తులకు శిఖర పూజ జరిపించారు. అనంతరం ఆలయం ఎదురుగా వేదమంత్రోచ్ఛరణల మధ్య మహా గణపతి హోమం జరిగింది. మధ్యాహ్నం నుంచి 21 మంది నూతన జంటలకు అమ్మవారి సన్నిధిలో కల్యాణాలు జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఘనంగా మోదకొండమ్మ జాతర ప్రారంభం
హుకుంపేట: గిరిజనుల ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం హుకుంపేటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఘటాలను ఊరేగింపుగా సతకంపట్టు వరకు మోసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే జాతర మహోత్సవాలను భక్తులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ సన్యాసి నాయుడు, సర్పంచ్ సమిడ వెంకటపూర్ణిమ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పాంగి అనిల్ పాల్గొన్నారు.

మత్స్యమాడుగులమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం

మత్స్యమాడుగులమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం

మత్స్యమాడుగులమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం