
ఒకటో తేదీనే లబ్ధిదారులకు పింఛన్లు చేరాలి
● గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి నాయక్
రంపచోడవరం: ఏజెన్సీలో వివి ధ రకాలైన సామా జిక పింఛన్లను ఒకటో తేదీనే లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్ద పంపిణీ చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మారేడుమిల్లి గ్రామంలో శ్యామల దివ్యజ్యోతి, మడకం శైలకు గురువారం వికలాంగ పింఛన్లు పంపిణీ చేశారు. మారేడుమిల్లి మండలంలో వివిధ గ్రామాలకు రోడ్లు నిర్మించాలని ఎంపీపీ సార్ల లలితకుమారి, సర్పంచ్ కొండ జాకబ్ ముఖ్య కార్యదర్శిని కోరారు. పీవో కట్టా సింహాచలం, ఎంపీడీవో తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఈఈ ఐ.శ్రీనివాసరావు, సుండం శ్రీనివాసుదొర, తదితరులు పాల్గొన్నారు.