
ప్రత్యేక డీఎస్సీ కోసం ముట్టడి
గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. కొద్ది సేపటి తర్వాత పీవో కట్టా సింహాచలం బయటకు రావడంతో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వెదుళ్లు లచ్చిరెడ్డి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు తీగల బాబురావు, సీపీఎం నాయకులు మట్ల వాణిశ్రీ, సిరిమల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చింతూరు: స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల నాయకులు, నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు స్థానిక ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీవో నంబర్ 3 పై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఉన్నత చదువుల్లో అడుగుపెడుతున్న ఆదివాసీ యువత జీవోల రద్దు కారణంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు ఓట్లకోసం జీవోను పునరుద్ధరిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించడం తగదని, ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి ఆదివాసీ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ కోసం ఈనెల రెండున నిర్వహిస్తున్న మన్యం బంద్‌ను జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం వారు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్‌కుమార్, సున్నం రాజులు, సీసం సురేష్, పల్లపు వెంకట్, మడివి రవితేజ, అగరం సుబ్బలక్ష్మి, రాఘవయ్య, నాగేశ్వరరావు, లావణ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.
7వ పేజీ తరువాయి

ప్రత్యేక డీఎస్సీ కోసం ముట్టడి

ప్రత్యేక డీఎస్సీ కోసం ముట్టడి