
పరిశ్రమ పార్కులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: జిల్లాలో రూ.500 కోట్లతో పరిశ్రమల పార్కుల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా పరిశ్రమలు, వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్‌శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొలుగొండ మండలంలో పరిశ్రమల పార్కు ఏర్పాటుకు అనకాపల్లి కలెక్టర్ 250 ఎకరాలు గుర్తించారని చెప్పారు. డుంబ్రిగుడ మండలం అరకులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి మే 1న శంకుస్థాపన చేయనున్నామని, అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లో అరకు బ్రాండ్ పేరున కాఫీ, మిరియాలు, పసుపు, చిరుధాన్యాలు, ఇతర గిరిజన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహిస్తామని చెప్పారు. పీఎం విశ్వకర్మ, ఎంఎస్‌ఎంఈ సర్వే, పీఎంఈజీఏ దరఖాస్తుల స్వీకరణపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి రవిశంకర్, ఏడీ రమణారావు, వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు ఎస్.బి.ఎస్.నందు, రమేష్‌కుమార్‌రావు పాల్గొన్నారు.
15 శాతం వృద్ధి లక్ష్యం : వ్యవసాయానుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. స్వర్ణాంధ్రా ప్రణాళికలపై కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానుబంధ రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించాలని, పంటల సాగును విస్తరించాలన్నారు. మండల, ఐటీడీఏ, జిల్లా స్థాయిలో వర్కుషాప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. కోల్డ్ స్టోరేజీలతో ప్రయోజనాన్ని పరిశీలించి, ఎక్కడ పెట్టాలో అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకట సాహిత్, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, పలుశాఖల అఽధికారులు పాల్గొన్నారు.