
ఆయుష్మాన్ భారత్ వైద్య ఉద్యోగుల రిలే దీక్షలు
సాక్షి,పాడేరు: తమకు ఉద్యోగ భద్రత కల్పించి,హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలనే డిమాండ్‌తో జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో పనిచేస్తున్న వైద్య ఉద్యోగులు పాడేరు ఐటీడీఏ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. మోకాళ్లపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు.ఆయుష్మాన్ భారత్ నిబంధనల మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జాతీయ హెల్త్ మిషన్ వైద్య ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని, నిర్ధిష్టమైన జాబ్‌చార్టుతో పాటు ఎఫ్‌ఆర్‌ఎస్ నుంచి సీహెచ్‌వోలను మినహాయించాలని, హెచ్‌ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, బదిలీలు, పితృత్వ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు రిలే దీక్షలను కొనసాగిస్తామని వారు తెలిపారు.