
మ్యుటేషన్ ప్రక్రియలో జాప్యం ఉపేక్షించను
కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: మ్యుటేషన్ ప్రక్రియలో జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి 22 మండలాల రెవెన్యూ అధికారులు,సర్వేయర్‌లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వేలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.వ్యవసాయ భూములకు నీటి వినియో గం చేసే ప్రాంతాల్లో నీటి పన్ను వసూలు చేయా లని ఆదేశించారు. 26వేల మంది పీవీటీజీలకు ఆధార్ కార్డులు,35వేల మందికి జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ భూములు అ న్యా క్రాంతమవుతున్నాయని హైకోర్టు సీరియస్‌గా ఉందని, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలన్నారు.జిల్లాలో జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని, మధ్యా హ్నం ఒంటిగంట నుంచి పర్యాటకులను జలపాతాల వద్దకు అనుమతించవద్దని ఆదేశించారు.
పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కేసులు
సామాజిక పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు.ఉపాఽధి హామీ,విద్యా,ఐసీడీఎస్,డీఆర్‌డీఏ,వైద్య,మలేరియాశాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ్త్రనిధి రుణాలను సక్రమంగా రికవరీ చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనుల లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఐసీడీఎస్ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాలని, బాలల హక్కులు,విద్యా కార్యక్రమాలు,సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.సికిల్‌సెల్ ఎనిమియా పరీక్షలతో పాటు దోమల నివారణ మందు పిచికారీ పనులు విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దోమల మందు పిచికారీకి పంచాయతీ అధికారులు,సిబ్బంది సహకరించని పక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జెడ్పీ సీఈవోను ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్ కోసం టోల్‌ఫ్రీ నంబర్
ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏ, ప్రతి సోమవారం రంపచోడవరం ఐటీడీఏ, ప్రతి బుధవారం చింతూరు ఐటీడీఏలో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం మండల పరిషత్,తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించాలని ఆదే శించారు. జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ,పాడేరు,రంపచోడవరం సబ్‌కలెక్టర్‌లు సౌర్యమన్ పటేల్,కల్పశ్రీ,అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకట సాహిత్,డీఆర్‌వో పద్మలత,అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.