
ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుక
రంపచోడవరం: పదో తరగతి పరీక్షలుఫెయిల్ అయిన విద్యార్థులకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఫెయిలైన విద్యార్థులకు మండలంలోని ముసురుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ భోజన వసతితో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే విద్యా సంవత్సరం వృథా కాకుండా ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుందని చెప్పారు. అనంతరం పీవో తన క్యాంపు కార్యాలయం నుంచి బ్యాంకు మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలకరి నాటికి రైతులకు బ్యాంకు రుణాలు అందజేయాలని తెలిపారు. రైతులు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించాలన్నారు.