ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై సమగ్ర సర్వే | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై సమగ్ర సర్వే

Apr 29 2025 7:00 AM | Updated on Apr 29 2025 7:00 AM

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై సమగ్ర సర్వే

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై సమగ్ర సర్వే

సాక్షి,పాడేరు: ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి, యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపునకు ఏర్పాటు చేసిన హైలెవెల్‌ అధికారుల కమిటీ సమావేశాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామ సర్వేయర్‌, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు సంయుక్తంగా బంజరు భూములు, గ్రామకంఠం భూముల ఆక్రమణలపై సర్వే చేసి నివేదించాలన్నారు. సర్వేలో రెవెన్యూ,సర్వే అధికారులు కీలకపాత్ర వహించాలని చెప్పారు. ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసి,వారం రోజుల తరువాత రెవెన్యూ,పోలీసు,పంచాయతీ అధికారులు సంయుక్తంగా యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, నీటి పారుదలశాఖల భూముల ఆక్రమణలను గుర్తించి, తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌అండ్‌బీ భూములను గుర్తించి డి–మార్కు చేయాలని కలెక్టర్‌ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అఽధికారి లవరాజు,డీఎస్పీ ఎస్‌.కె.షహబాజ్‌ అహ్మద్‌,డీఎల్‌పీవో కుమార్‌,సర్వే ఏడీ కె.దేవేంద్రుడు, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు,ఎస్‌ఎంఐ ఈఈ రాజేశ్వరరావు,డీఈఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement