
28 ఏళ్ల నుంచి చందనం అరగదీత
నేను 28 ఏళ్ల నుంచి చందనం అరగదీతలో పాల్గొంటున్నాను. చందనం అరగదీత చేపట్టే రోజుల్లో ఆలయం అంతా ఒక కొత్త వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా చందనాన్ని అరగదీస్తాం. స్వామిపై ఉండే చందనం మా చేతుల మీదుగా అరగదీయడం నిజంగా ఆ స్వామి మాకు కల్పించిన మహా భాగ్యమే.
– శిడగం అప్పలరాజు, నాల్గవ తరగతి ఉద్యోగి
ఇదంతా అప్పన్న స్వామి
అనుగ్రహం
ఉద్యోగంలో చేరినప్పటి నుంచి స్వామివారి చందనం అరగదీతలో పాల్గొంటున్నా. ఇప్పటికి సుమారు 30 ఏళ్లకు పైగానే చందనం అరగదీశాననుకుంటా. ఏటా నాలుగు విడతల్లో జరిగే అరగదీతలో క్రమంతప్పకుండా పాల్గొంటున్నా. స్వామిపట్ల భక్తితోపాటు, గంటల తరబడి చందనం అరగదీయడం మాకు మంచి వ్యాయామంగా కూడా ఉంటుంది.
– భీమవరపు అప్పారావు, నాల్గవ తరగతి ఉద్యోగి
●

28 ఏళ్ల నుంచి చందనం అరగదీత