జి.మాడుగుల: మండలంలో భీరం పంచాయతీ వెంకటపాలెం గ్రామం సమీప రిజ్వర్వు ఫారెస్ట్ భూముల్లో శనివారం జిల్లా డీఎఫ్‌వో పి.సందీప్‌రెడ్డి పర్యటించారు. వి.కోడాపల్లి(వెంకటపాలెం)లో ఉపాధి హామీ పథకం కింద పెంపకం చేపడుతున్న నర్సరీ, ప్లాంటేషన్ పనులను ఆయన పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీరం గ్రామంలో కాంప పథకం ద్వారా ప్లాంటింగ్ అడ్వాన్స్ పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఆర్.అప్పలనాయుడు, ఎఫ్‌ఎస్‌వోలు జి.శ్రీరాములు, వి.వి.నాయుడు, ఎఫ్‌బీవో మాధవి, సిబ్బంది సత్తిబాబు, ఎం.బాలన్న పాల్గొన్నారు.
అటవీ ప్రాంతాల్లో డీఎఫ్‌వో పర్యటన