సాక్షి, పాడేరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం జిల్లా నేతలు అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి(పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు), జీసీసీ మాజీ చైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మూర్తి, కమ్మిడి అశోక్, తదితరులు వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.