చింతపల్లి: ఏజెన్సీలో గిరిజనులు తేనె, అనుబంధ ఉత్పత్తులతో మంచి ఆదాయం పొందవచ్చని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం టీచింగ్ అసోసియేట్ బాపూజీ నాయుడు తెలిపారు. పరిశోధనా స్థానంలో తేనెటీగల పెంపకంపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో మూడవ రోజు ఆయన మాట్లాడారు. తేనెటీగల పెంపకం వల్ల తేనెను పొందడంతో పాటు మరెన్నో ఉపయోగాలున్నాయన్నారు. తేనె మైనం, పుప్పొడి ద్వారా కూడా రైతులు ఆదాయం పొందవచ్చని చెప్పారు. తేనె పట్టులను వేరుచేసి ఉడికించడం వల్ల మైనం వస్తుందని,ఆ మైనం పాలిష్,కొవ్వొత్తుల తయారీలో ఉపమోగపడుతుందని తెలిపారు. వాటికి మంచి డిమాండ్ ఉందన్నారు.పెట్టెలో తెనెటీగలను భద్రపరిచి పుప్పొడిగా తయారు చేసుకోవచ్చని దానికి మంచి ధర ఉందన్నారు. తేనె టీగల పెంపకంలో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులతో అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీచింగ్ అసిస్టెంట్ ఎస్.శ్వేత,ఆర్‌ఏ డాక్టర్ టి.సునీల్‌కుమార్, గిరిజన రైతులు పాల్గొన్నారు.