కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: రానున్న ఖరీఫ్‌లో రైతులకు ఇచ్చే పంట రుణ పరపతిని పెంచి, పెద్ద ఎత్తున మంజూరు చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు.కలెక్టరేట్‌లో బుధవారం వ్యవసాయానుబంధ శాఖలు,బ్యాంకుల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.672 కోట్ల రుణాలు మంజూరు చేయాలన్నది లక్ష్యం కాగా, గత డిసెంబర్ త్రైమాసానికి రూ.607 కోట్లు రుణాలు అందించారని, మిగిలిన రూ.90.43కోట్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు.జిల్లాలో రెండు ప్రైవేటు,50 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయని,3,018మంది బిజినెస్ కరస్పాండెంట్లు పనిచేస్తున్నారని తెలిపారు.బ్యాంకు అధికారులు అంకిత భావంతో పనిచేసి నిర్ధేశించిన రుణ లక్ష్యాలు పూర్తి చేసి, జిల్లా అభివృద్ధితో పాటు 15శాతం వృద్ధి రేటు సాధించాలని ఆయన ఆదేశించారు.వచ్చే త్రైమాసికంలో 10వేల మంది ఎస్సీ,ఎస్టీలు,మహిళలకు రుణాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో యూబీఐ ఆర్‌ఎం పి.నరేష్, ఎల్‌డీఎం మాతునాయుడు,నాబార్డు డీడీఎం చక్రధర్,ఏపీజీవీబీ ఆర్‌ఎం సతీష్‌చంద్ర,సీడ్బీ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసరావుతో పాటు వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు పాల్గొన్నారు.
గంజాయి ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్
జిల్లాలో గంజాయి సాగు, రవాణా,ఇతర ఫిర్యాదులకు ఈగిల్‌సెల్ 1972 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని, దీనిపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్‌కుమార్ కోరారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌తో కలిసి పలుశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.పోలీసుశాఖ డ్రోన్ల సహాయంతో 82 ఎకరాల్లో గంజాయి సాగును గుర్తించినట్టు చెప్పారు. రైతులకు గంజాయి సాగు వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులను ఆదేశించారు.గంజాయి కేసుల్లో పట్టుబడిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలన్నారు. ఎస్పీ అమిత్‌బర్దర్ మాట్లాడుతూ వంద రోజుల కార్యాచరణలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విధానం ద్వారా గంజాయి సాగు ప్రాంతాలు,సాగుచేస్తున్న రైతుల వివరాలు సులభంగా గుర్తుపట్టడం జరుగుతుందన్నారు.పెదబయలు మండలం నుంచే గంజాయి రవాణా జరుగుతున్నట్టు గుర్తించామని చెప్పారు. ఈసమావేశంలో వ్యవసాయ,అనుబంధ విభాగాల జిల్లా అధికారుల ఎస్.బి.ఎస్.నందు,రమేష్‌కుమార్‌రావు,అప్పారావు,శ్రీనివాసరావు,డీఈవో పి.బ్రహ్మాజీరావు,డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాష,డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లక్ష్మి,ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.