
మంచినీటి చేపల పెంపకంపై శిక్షణ
రంపచోడవరం/ గంగవరం: మంచినీటి చేపల పెంపకంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై కాకినాడ కేంద్రీయ మత్స్య శిక్షణ సంస్థ, పందరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం హాజరై మాట్లాడారు. ముఖ్యంగా ఐటీడీఏ ద్వారా రైతులకు శిక్షణ నిర్వహించి చేప పిల్లలను, మేతను రాయితీ ద్వారా అందిస్తామన్నారు. నివేదికలు అందించాలన్నారు. కాకినాడ సీఏఎఫ్‌ఈ సంస్థ అధికారి మురళీధర్ సాంకేతిక నూతన పద్ధతులు, సంస్థ నిర్వహిస్తున్న పరిశోధనలను వివరించారు. సీనియర్ శాస్త్రవేత్త కె.శ్యామల, కేవీకే శాస్త్రవేత వీరాంజనేయులు, కేవీకే అధికారి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.