తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం

Mar 18 2025 8:35 AM | Updated on Mar 18 2025 8:35 AM

తొలి

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం

సాక్షి,పాడేరు: జిల్లాలోని 71 పరీక్ష కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రం పాడేరులోని ఐదు పరీక్ష కేంద్రాలతో పాటు మిగిలిన అన్ని చోట్ల ఉదయం 8గంటలకే విద్యార్థులు చేరుకున్నారు.మహిళా పోలీసులు, ఇతర సిబ్బంది తనిఖీలు జరిపిన తరువాతే విద్యార్థులను గదుల్లోకి పంపారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 సమస్యాత్మక కేంద్రాల్లో హుకుంపేట మండలం బాకూరు పరీక్ష కేంద్రం మినహా మిగిలిన 19 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

117 మంది గైర్హాజరు

తొలి పరీక్షకు 11,466 మంది రెగ్యులర్‌, 28 మంది ప్రైవేట్‌ విద్యార్థులతో కలిపి మొత్తం 11,494 మంది హాజరు కావాల్సి ఉండగా, రెగ్యులర్‌ విద్యార్థులు 112 మంది, ప్రైవేట్‌ విద్యార్థులు ఐదుగురు కలిపి మొత్తం 117మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రం పాడేరులోని ఐదు పరీక్ష కేంద్రాలకు సంబంధించి కుమ్మరిపుట్టు గురుకుల కళాశాల సెంటర్‌లో 100 మందికి 100 మంది.గురుకుల కళాశాల సెంటర్‌లో 165 మందికి 163 మంది, లోచలిపుట్టు ఆశ్రమ పాఠశాల సెంటర్‌లో 158 మందికి 157 మంది, శ్రీకృష్ణాపురం సెంటర్‌లో 260 మందికి 259 మంది, తలారిసింగి పాఠశాల సెంటర్‌లో 230 మందికి 229 మంది,ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సెంటర్‌లో 90 మందికి 90 మంది పరీక్షలు రాశారు. 71 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు,ఎనిమిది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షించాయి.

ఆటోలో విద్యార్థినులు..

రాయిగెడ్డ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన సుమారు 10మంది టెన్త్‌ విద్యార్థినులు పాడేరు జూనియర్‌ కళాశాల సెంటర్‌కు ఆటోలో చేరుకున్నారు. ఆర్టీసీసంస్థ బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేసినప్ప టికీ సమయానికి అందుకోలేకపోయారు. పాఠశా ల హెచ్‌ఎం,డిప్యూటీ మేట్రిన్‌ వెంటనే సర్వీస్‌ ఆటోను ఏర్పాటు చేయడంతో సకాలంలోనే పరీక్ష కేంద్రానికి చేరుకుని పరీక్ష రాశారు.

ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు ప్రారంభం

సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.పాడేరు డివిజన్‌లోని పాడేరు,చింతపల్లిలలో ఏడు పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.74 మంది విద్యార్థులకు గాను 65మంది విద్యార్థులు తొలిపరీక్షకు హాజరుకాగా,9మంది గైర్హాజరయ్యారని డీఈవో పి.బ్రహ్మాజీరావు తెలిపారు.

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం 1
1/5

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం 2
2/5

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం 3
3/5

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం 4
4/5

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం 5
5/5

తొలి రోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement