
ముంచంగిపుట్టు: రంగబయలు పంచాయతీ గిరిజనుల 75 ఏళ్ల రహదారి కల తమ ప్రభుత్వ హయాంలో నెరవేరుతుందని ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని అత్యంత మారుమూల రంగబయలు పంచాయతీలో వనుగుమ్మ నుంచి జోడిగుమ్మ వరకు పీఆర్ నిధులు రూ.16.90 కోట్ల వ్యయంతో 22 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న తారు రోడ్డు పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో మారుమూల గ్రామాలకు శరవేగంగా రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు. రంగబయలు పంచాయతీ గిరిజనుల రవాణా కష్టాలు త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన విధానంతోనే మారుమూల గ్రామాలకు సంక్షేమ పథకాలు, సౌకర్యాలు అందుతున్నాయన్నారు. వైస్ ఎంపీపీ భాగ్యవతి, వైఎస్సార్‌సీప మండల అధ్యక్షుడు మల్లికార్జున్, సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
వనుగుమ్మ – జోడిగుమ్మ రోడ్డు పనుల పరిశీలన