
సమావేశంలో మాట్లాడుతున్నడీఎల్పీవో రాఘవన్
● డీఎల్పీవో రాఘవన్
రంపచోడవరం: ఇంటి పన్ను బకాయిలు వసూలు చేసి పంచాయతీ ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని డీఎల్పీవో జీఎల్‌ఎన్‌వీ రాఘవన్ సూచించారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి జిల్లా ప్లానింగ్ అధికారి అవగాహన కల్పించారు. పంచాయతీ ఆస్తుల వివరాలు నమోదు చేయని కార్యదర్శులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్పంచ్ మంగా బొజ్జయ్య పాల్గొన్నారు.