
పూజా సామగ్రితో న్యాయమూర్తిప్రకాష్‌బాబు దంపతులు, కుటుంబ సభ్యులు
సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరులోని మోదకొండమ్మతల్లిని తాడేపల్లిగూడెం అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కర్రి ప్రకాష్‌బాబు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మోదమ్మకు న్యాయమూర్తి ప్రకాష్‌బాబు, అతని భార్య, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు పసుపు, కుంకుమ సమర్పించారు. ఉత్సవ విగ్రహాన్ని తలపై పెట్టుకుని మోశారు.అనంతరం న్యాయమూర్తి దంపతులతో ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం అమ్మవారికి కుంకుమార్చన పూజలు జరిపించారు. గతంలో ప్రకాష్‌బాబు పాడేరు కోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రకాష్‌బాబు దంపతులకు పాడేరులోని సీనియర్ న్యాయవాది బండారు వెంకటరమణ, పాడేరు ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడులు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, మోదమ్మ చిత్రపటంతో పాటు ప్రసాదం అందజేశారు.