
మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ధారకొండ పంచాయతీలో శుక్రవారం పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మవారి దారకొండ, నల్లమొక్కలు, చిలకవీధి, ఎస్.కొత్తూరు, పనసలబంద గ్రామాల్లో పర్యటించి, 177 గడపలను సందర్శించారు. వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. గూడెంకొత్తవీధి సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ అప్పలసూరి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అడుగడుగునా పోలీసు బలగాలు మోహరించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాయి.
– గూడెంకొత్తవీధి