యూరియా పంపిణీలో అమలుకాని ప్రణాళిక సొసైటీల్లో నోస్టాక్, ప్రైవేట్‌లో నామమాత్రమే! మార్క్‌ఫెడ్ వద్ద స్టాక్ ఉన్నా పంపిణీలో వైఫల్యం గతేడాది నుంచి పాఠం నేర్వని వ్యవసాయశాఖ
కొద్ది రోజుల్లో వానాకాలం సాగు సీజన్ మొదలవుతుంది. మార్క్‌ఫెడ్ వద్ద యూరియాతో పాటు ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నార ుు. ముందస్తుగానే వాటిని పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్లకు పంపిణీ చేయాలి. అ యితే వ్యవసాయ శాఖ ఇప్పటివరకు సరైన కార్యాచరణ రూపొందించలేదనే విమర్శలున్నాయి. దీంతో ఇటు సొసైటీల్లో నోస్టాక్ దర్శనమిస్తుండగా, అటు ప్రైవేట్ వద్ద నామమాత్రంగా ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ నివేదికలే స్పష్టం చేస్తుండడం గమనార్హం.
కార్యాచరణ ఏది..
ముందుగానే సొసైటీలు, ప్రైవేట్ డీలర్లకు యూరియాను పంపిణీ చేసిన పక్షంలో రైతులకు సౌకర్యంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎక్కడా సరైన స్టాక్ లేదు. సీజన్ మొదలైన తర్వాత యూరియా కావాలని రైతులంతా ఒకేసారి వచ్చే పరిస్థితి ఉంటుంది. అదే జరిగితే మళ్లీ దుకాణాల ఎదుట బారులు తప్పకపోవచ్చు. గతేడాది జిల్లాలో అనేకచోట్ల ఈ సమస్య తలెత్తింది. ఈక్రమంలో యంత్రాంగం అప్రమత్తమై పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలి. కానీ ఆ కార్యాచరణ ఇప్పటివరకు అమలు చేయడం లేదనే విమర్శలున్నాయి. మరోవైపు యూరియా స్టాక్ మార్క్‌ఫెడ్ వద్ద ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ చెబుతున్నా పంపిణీకి సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడం గమనార్హం.
యాప్ అమలు తర్వాత..
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 20 నుంచి ఫ ర్టిలైజర్ యాప్‌ను అమలులోకి తీసుకొచ్చింది. త ద్వారా రైతులు ముందుగా బుక్ చేసుకొని నిర్ధారిత సమయానికి, ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో వాటిని తీసుకునే అవకాశం కల్పించింది. అయితే యాప్ అమలులోకి వచ్చాక రైతులు ముందుగా బుక్ చేసుకొని కావాల్సిన ఎరువు మాత్రమే తీసుకుంటున్నారు. అంతకుముందు యూరియా కోసం వచ్చే రైతులకు వాటితో పాటు డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ ఇలా ఇతర ఎరువులను కూడా ప్రైవేట్ డీలర్లు, వ్యాపారులు అంటగట్టి వ్యాపార పరంగా ప్రయోజనం పొందేవారు. యాప్ రాకతో పరిస్థితి మారింది. డీలర్లు ప్రస్తుతం రైతు బుక్ చేసుకున్న ఎరువు మాత్రమే ఇవ్వాలి. ఈ క్రమంలో ప్రైవేట్ వ్యాపారులకు యూరియా విక్రయాలపై పెద్దగా మార్జిన్ లేకపోవడం, ఇతర ఎరువులను విక్రయించే పరిస్థితి లేకపోవడంతో వారు వీటి విక్రయాలపై ఆసక్తి చూపడం లేదనే ప్రచారం సాగుతుంది. దీంతోనే ప్రస్తుతం ప్రైవేట్‌లో నామమాత్రంగా స్టాక్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వానాకాలంలోనూ ఇదే పరిస్థితి ఎదురైతే రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్ద మళ్లీ బారులు తీరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదీ పరిస్థితి..
వానాకాలం సాగు సీజన్ సమీపిస్తోంది. విత్తనాలు నాటిన తర్వాత రైతులకు యూరియా అవసరమవుతోంది. ఆ సమయంలో అంతా ఒకేసారి వస్తుండడంతో బారులు తీరాల్సిన దుస్థితి. జిల్లాలో గతేడాది ఈ సమస్య తలెత్తింది. అయినా వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ పాఠం నేర్వనట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రణాళిక రూపొందించకపోవడం, పకడ్బందీ కార్యాచరణ లేకపోవడంతో ఈ సారి కూడా అగచాట్లు తప్పవా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
– సాక్షి,ఆదిలాబాద్
జిల్లాలో ఏటా ప్రభుత్వ కేంద్రాలైన సొసైటీలు, డీసీఎంఎస్‌లు, అగ్రో సేవ కేంద్రాలతో పాటు ప్రైవేట్ షాపుల్లో కలిపి లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ఎరువుల విక్రయాలు జరుగుతాయి. ఇందులో ప్రభుత్వ కేంద్రాల్లో 60 శాతం, ప్రైవేట్‌లో 40 శాతం వరకు విక్రయిస్తారు. ఒక్కోసారి ప్రభుత్వ కేంద్రాల్లో అందుబాటులో లేకపోతే రైతులు ప్రైవేట్‌లో కొనుగోలు చేస్తారు. అక్కడా లేకపోతే రైతుల కష్టాలు వర్ణనాతీతమే.
మార్క్‌ఫెడ్ వద్ద : 14,631 మెట్రిక్ టన్నులు
ప్రైవేట్ డీలర్ల వద్ద: 1,158 మెట్రిక్ టన్నులు
కంపెనీల వద్ద : 1,266 మెట్రిక్ టన్నులు
పంపిణీకి సిద్ధం చేశాం..
జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి యూరియాతో పాటు ఇత ర ఎరువులు పంపిణీకి స రిపడా స్టాక్ ఉంది. దీన్ని సొసైటీలు, ప్రైవేట్ డీలర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నాం. – శ్రీధర్ స్వామి,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి


