విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని సీజీఆర్‌ఎఫ్‌ చైర్మ న్‌ సలంద్ర రామకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ శాఖ కార్యాలయంలో విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్‌)ను ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సీజీఆర్‌ఎఫ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. బిల్లుల్లో హెచ్చుతగ్గులు, మీటర్ల సమస్యలు, వేలాడే తీగలు, ట్రాన్స్‌పార్మర్ల సమస్యలు తదితర వాటిపై వినియోగదారులు దరఖాస్తులు అందజేశారు. సమస్యల పరిష్కారానికి చ ర్యలు చేపడతామని ఆయన వివరించారు. ఇందులో విద్యుత్‌ శాఖ సీఈ జేఆర్‌ చౌహాన్‌, సీజీ ఆర్‌ఎఫ్‌ ఫైనాన్స్‌ మెంబర్‌ సత్యనారాయణ, డీఈ నాగరాజు, అధికారులు జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌, రాజన్న, సతీశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement