ఓవరాల్‌ చాంపియన్‌గా ఆదిలాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

ఓవరాల్‌ చాంపియన్‌గా ఆదిలాబాద్‌

Mar 31 2026 8:26 AM | Updated on Mar 31 2026 8:26 AM

● జిల్లా క్రీడాకారులకు కలెక్టర్‌ అభినందన

కై లాస్‌నగర్‌: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్‌–2025 (సెకండ్‌ ఎడిషన్‌) పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి ఓవరాల్‌ చాంపియన్‌గా ప్రథమ స్థానంలో నిలిచారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బంది వారు సాఽధించిన కప్‌తో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిఽశారు. వారిని అభినందించారు. క్రీడా రంగంలో జిల్లా, రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు భవిష్యత్తులో ఇదే పట్టుదలతో కృషి చేసి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీఎం కప్‌ పోటీల విజయవంతంలో భాగంగా చేపట్టిన క్రీడా జ్యోతి ర్యాలీలు, ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ, మండల, జిల్లాస్థాయి పోటీల సమర్థ నిర్వహణ కీలక పాత్ర పోషించాయన్నారు. ఈ విజయానికి క్రీడాకారులతోపాటు కోచ్‌లు, క్రీడా శాఖ సిబ్బంది సమష్టి కృషి కారణమని అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ జక్కుల శ్రీనివాస్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, ట్రైనీ కలెక్టర్‌ సలోని చాబ్రా, ఆర్డీఓ స్రవంతి, డీఆర్‌డీఓ రవీందర్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement