హత్యకేసులో ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో ఇద్దరి అరెస్టు

Mar 31 2026 8:26 AM | Updated on Mar 31 2026 8:26 AM

● వెల్లడించిన ఎస్పీ నితికపంత్‌

ఆసిఫాబాద్‌: మండలంలోని గుండి శివారులో నాలుగేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ నితిక పంత్‌ తెలిపారు. సోమవారం హత్య కేసు వివరాలు విలేకరులకు వెల్లడించారు. 2022లో పెంచికల్‌పేట్‌ మండలానికి చెందిన సాగర్‌ ఆసిఫాబాద్‌ మండలం గుండి గ్రామానికివెళ్లే దారిలో శవమై కనిపించాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసును ఎస్పీ చొరవతో దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సాగర్‌ను కాగజ్‌నగర్‌కు రమ్మని పిలిచి, ఆటోలో ఎక్కించి ఆసిఫాబాద్‌ మండలం గుండి శివారు పంట పొలాల వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసును హత్యగా నిర్ధారించారు. కౌటాల బాలుర వసతి గృహం కుక్‌ కొండూరి మల్లేశ్వరి, కాగజ్‌నగర్‌ ద్వారాకానగర్‌కు చెందిన ఎన్నం అశోక్‌, పెంచికల్‌పేట్‌ మండలం అగర్‌గూడకు చెందిన చెన్నూరి స్వామి నేరాన్ని ఒప్పుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా, చెన్నూరి స్వామి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు, వీరిలో సీఐ బాలాజీ వరప్రసాద్‌, డీసీఆర్‌బీ సీఐ శ్రీధర్‌, ఐటీకోర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, కౌటాల ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ కుమార్‌, ఐటీకోర్‌ కానిస్టేబుల్‌ మహేశ్‌ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement