● మట్టితో గృహోపకరణాల తయారీ ● టెక్స్‌టైల్స్ శాఖ ఆధ్వర్య
శిక్షణ పొందుతున్న మహిళలు
మట్టితో
రూపుదిద్దుకున్న
నంది
కళాకృతి
కేంద్ర టెక్స్‌టైల్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ హ్యాండీక్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. నవంబర్ 23న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 23తో ముగియనుంది. ఇందులో భాగంగా మట్టితో తయారు చేసే 25 రకాల వస్తువులను సృజనాత్మకంగా డిజైన్ చేసేలా శిక్షణ ఇస్తున్నారు. మహిళలు ఉత్సాహంగా వాటిని భిన్న ఆకృతుల్లో తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. శిక్షణతో పాటు స్టైఫండ్ రూపంలో రూ.7,500 అందుతుండడంతో పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.
శిక్షణతో పాటు మార్కెటింగ్ మెలకువలు
శిక్షణతో పాటు వారు తయారు చేసిన వాటికి ఏ విధంగా మార్కెటింగ్ చేయాలనే విషయంపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. సృజనాత్మకంగా తయారు చేసిన కళాకృతులను హస్తకళ మేళాలు జరిగినప్పుడు ప్రదర్శించేలా నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందిస్తున్నారు. అంతేకాకుండా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి రుణాలు ఇప్పించేలా సైతం పరిశ్రమల శాఖతో తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.
మట్టితో తీర్చిదిద్ది.. రంగులద్ది..
మహిళలు ముందుగా బంక మట్టి, ఎర్రమట్టి, టెర్రాకోట మట్టితో కళాకృతులను తయారు చేస్తున్నారు. వాటిని మూడు రోజులపాటు ఎండబెట్టి, అనంతరం 3 నుంచి 4 గంటల పాటు బట్టిలో కాలుస్తున్నారు. బయటకు తీసిన తర్వాత వాటిని శుభ్రం చేసి ఆయిల్ పెయింట్ వేస్తున్నారు. వాటిపై ప్రత్యేక డిజైన్లు వేస్తూ తీర్చిదిద్దుతున్నారు.
● మట్టితో గృహోపకరణాల తయారీ ● టెక్స్‌టైల్స్ శాఖ ఆధ్వర్య


