రోడ్డెక్కిన విద్యార్థులు
బోథ్:నాసిరకం భోజనం తినలేకపోతున్నామంటూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో భో జ నంలో పురుగులు వస్తున్నాయంటూ పలువురు వి ద్యార్థులు శనివారం హాస్టల్ నుంచి బయటకు వ చ్చారు. బస్టాండ్ వైపునకు వెళ్లారు. విషయం తెలు సుకున్న స్థానిక ఎస్సై శ్రీసాయి అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. తిరిగి వసతి గృహానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏటీడబ్ల్యూవో సుచరితన్‌రెడ్డి ఎస్సైతో చర్చించారు.గతంలో కూడా కొంతమంది విద్యార్థులు భోజనంలో పు రుగులు వస్తున్నాయని తెలిపారని పేర్కొన్నారు. కొందరు మాత్రం ఎలాంటి పురుగులు రావడం లేదని పేర్కొన్నారని తెలిపారు. కాగా, క్రమశిక్షణగా ఉండాలని, ఫోన్లు వాడవద్దని వార్డెన్ నాందేవ్ అనడంతోనే సీని యర్లు ఇలా చేశారని మిగతా విద్యార్థులు పేర్కొన్నా రు. ఎస్సైతో పాటు ఏటీడబ్యూవో హాస్టల్‌ను సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
వసతిగృహాన్ని సందర్శించిన డీడీ
ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఐటీడీఏ డీడీ అంబాజీ శనివారం ఉదయం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో నిల్వ ఉన్న సరుకులు, రికార్డులను పరిశీలించారు. క్రమశిక్షణతో చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట వార్డెన్ నాందేవ్ ఉన్నారు. కాగా, డీడీ వచ్చిన వెళ్లిన తర్వాత విద్యార్థులు ఆందోళనకు దిగడం గమనార్హం.


