● పల్లె ఓటమిని దిగమింగుకుని.. ● పార్టీ టికెట్ కోసం యత్
కై లాస్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైన అభ్యర్థులు పరిషత్ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతో సర్పంచ్ పదవి దక్కించుకోవాలని భావించినా ఓటర్ల మద్దతు కూడగట్టుకోలేకపోయారు. కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే ఉద్దేశంతో పరిషత్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడాత్వరలోనే ఉంటాయనే ప్రచారంతో మరోసారి బరిలో నిలవాలని తపిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లను ఆశిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్య నేతల అనుగ్రహం కోసం ఆరాటపడుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. టికెట్ తమకే అంటూ తమ అనుచరులతో చర్చిస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఓటమిని దిగమింగుకుని..
ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన గ్రామ, మండల ద్వితీయస్థాయి నాయకులు ఆయా పార్టీల మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేశారు. పార్టీ అండ లభించని వారు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. గ్రామ ప్రథమ పౌరుడి హోదా దక్కించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. గెలుపే లక్ష్యంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. నోటిఫికేషన్ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు మద్యాన్ని ఏరులై పారించారు. పలు గ్రామాల్లో ఓటుకు రూ.300 నుంచి రూ.500 వరకు పంచారు. ఇసుక దందా సాగే పెన్‌గంగ పరీవాహక, రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని గ్రామాల్లో అయితే ఓటుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు పంపిణీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే విందులు సైతం జోరుగానే సాగాయి. ఇలా సర్పంచ్ అభ్యర్థులు కనిష్టంగా రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.30లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. అయినా కొంతమందిని అదృష్టం వరించకపోవడంతో ఓటమి పాలయ్యా రు. అయితే త్వరలోనే పరిషత్ ఎన్నికలు ఉన్నట్లుగా ప్రచారం మొదలవడంతో ఓటమిని దిగమింగుకుని పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారు. రిజర్వేషన్ అనుకూలిస్తే పార్టీ పరంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు షురూ చేశారు. ఓడినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పార్టీ టికెట్ లభిస్తే సానుభూతితో పాటు పార్టీ పరంగా మద్దతు దక్కి గెలువవచ్చనే ఆలోచన చేస్తున్నారు.
ముఖ్యనేతల అనుగ్రహం పొందేలా..
పరిషత్ ఎన్నికలు పార్టీ పరంగా జరగనుండటంతో పోటీచేసే అభ్యర్థులకు ముఖ్యనేతల అనుగ్రహం తప్పనిసరి. ఈ క్రమంలో పోటీకి సై అంటున్న ఆశావహులు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ వంటి ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఆయా పార్టీల జిల్లా అ ధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అ నుగ్రహం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎలాగైనా వారి మద్దతు కూడగట్టుకోవాలని భా వి స్తున్నారు. నిన్న మొన్న టివరకు పంచాయతీ ఎన్నికల్లో బీజీగా గడిపిన వారు ప్రస్తుతం పొద్దెక్కగానే నే తల ఇళ్ల ముందట వాలిపోతున్నారు. నిత్యం వారికి టచ్‌లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల షె డ్యూల్ ఇంకా రానప్పటికీ రాజకీయ పార్టీల నేతలు మాత్రం గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో ప డ్డారు. గ్రామాల్లో ప్రజల మద్దతు ఉన్న అభ్యర్థుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆశావహులు అందులో తమ పేరు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఎన్నికలకు ముందే పరిషత్ రాజకీయం వేడెక్కింది.


