నేరాల అదుపునకు కృషి చేయాలి
ఇంద్రవెల్లి: పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ నేరాల అదుపునకు కృషి చేయాలని ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయల్ 100, పోలీస్ అక్క కార్యక్రమాల అమలుపై పలు సూచనలు చేశారు. విధి నిర్వహణ లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటారు. ఇందులో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, కానిస్టేబుళ్లు ఉన్నారు.


