సేంద్రియ సాగుతో అధిక దిగుబడి
నార్నూర్: సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి శ్రీధర్ స్వామి అన్నారు. గాదిగూడలోని రైతువేదిక భవన్‌లో సీపీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. అనంతరం జొన్న విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు సాగులో డీఏపీ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకంతో తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించవచ్చన్నారు. ఇందులో ఏడీఏ గణేశ్ రాథోడ్, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం ప్రతినిధి కృష్ణవేణి, ఏవో యాకన్న, సీపీఎఫ్ ప్రోగ్రాం అధికారి రాథోడ్ దిలీప్, ఏఈఓ లు పాల్గొన్నారు.


