వీకెండ్ వండర్స్‌లో పాల్గొనండి
కై లాస్‌నగర్: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్‌లో జిల్లావాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజేతలుగా నిలువాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. ఈ మేరకు కాంటెస్ట్ ప్రచార పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బాహ్య ప్రపంచానికి తెలియని వండర్స్‌ను కనుగొనడం, ప్రకృతి వన్యప్రాణి, ఆర్ట్, కల్చర్, హెరి టేజ్, వాటర్‌బాడీఎస్ రూరల్ ఏరియాలో బస, ఆధ్యాత్మికత, సాహసం (అడ్వంచర్) వంటి అంశాలపై మూడు ఫొటోలతో వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు. కనెక్టివిటీ, దూరం, రవాణా, గూగుల్ లొకేషన్ వంటి సమాచారంను 100 పదాలతో ప్రదేశం, సందర్శించిన సమయం, బస, బడ్జెట్, సేఫ్టీకి సంబంధించిన వివరణను 60 సెకన్ల వీడియోలో పొందుపర్చాలని తెలిపారు. ఆసక్తి గల వారు 5 జనవరి 2026లోగా HTTPS:// FORMS.IFORMS.GLE/VVJB7NZWBUZ7NWJY6లో సమర్పించాలని పేర్కొన్నారు. మొదటి బహుమతిగా రూ.50వేలు, రెండో బహుమతి రూ.30వేలు, మూడో బహుమతి రూ.20వేలతో పాటు 10 కన్సలోషన్ బహుమతులను సంక్రాంతి రోజున అందజేయనున్నట్లు తెలి పారు. అలాగే రెండు రోజులు ఉచితంగా హరిత హోటల్స్‌లో బస సదుపాయం కల్పించనున్నుట్ల పేర్కొన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఆర్డీవో రవీందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.


