ఎవరీ ప్రభంజన్
జన్నారం: ప్రభంజన్ జన్నారం మండలంలోని మారుమూల గ్రామాలైన ఆదివాసీ గిరిజనుల సమస్యల పై అధికారుల దృష్టికి తీసుకెళ్లేవాడు. గతంలో జన్నారంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో కూడా పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపాడు. గత కొంతకాలంగా అందరితో ఉన్న వ్యక్తి మావోయిస్టు అర్బన్ ఏరియా కోఆర్డినేటర్ అనే వార్త రావడంతో మండలంలో చర్చనీయాంశమైంది. ఆయన కు పొనకల్‌లోని గాంధీనగర్‌లో సొంత ఇల్లు ఉంది. తల్లిదండ్రులు లక్ష్మి, కాంతన్న, చెల్లెలు ఉన్నారు. చెల్లెలికి వివాహం కాగా, తల్లిదండ్రులతో ఆయన గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు.


