గుణాత్మక విద్య అందించాలి
నార్నూర్: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్య మైన భోజనంతో పాటు గుణాత్మక విద్య అందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మ ర్మాట్ అన్నారు. మండలంలోని గిరిజన ఆశ్రమ (బా లికలు), ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు. రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీ లించారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హా జరుశాతం పెంచాలన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఉదయం వేడి నీళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆశ్ర మ పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు అందజేత
ఉట్నూర్‌రూరల్: విద్యార్థినులు సాంకేతిక విద్యలోనూ రాణించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఉట్నూర్ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలకు శుక్రవారం ఉచి తంగా కంప్యూటర్లు అందజేశారు. ఇందులో ఫౌండేషన్ సంస్థ అధినేత ఎండీ.బాబర్, రాష్ట్ర సమన్వయకర్త ఎండీ.సాబీర్ హుస్సేన్, ఐటీడీఏ ఉపసంచాలకులు అంబాజీ యాదవ్, ఏసీ ఎంవో జగన్, ఏటీడీవో సదానందం, ఎంఈవో ఆశన్న, ప్రిన్సిపాల్ మాణిక్ రావు, గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధి కారులు పాల్గొన్నారు.


