 
															అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని హార్టికల్చ ర్ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం 2023 –25 బ్యాచ్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్‌డే నిర్వహించగా, విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ జిల్లా అధికారి నర్సయ్య మా ట్లాడుతూ.. చెడు వ్యసనాలతో భవిష్యత్ నాశ నం అవుతుందని, విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించా రు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ మురళి, మావల సీఐ స్వామి, ఎస్సై రాజశేఖర్, నాబార్డ్ అధికారి అబ్దుల్ రవూఫ్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గజానంద్, లెక్చరర్ అశ్విని పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
