 
															కలెక్టర్‌కు భీంపూర్ రైతుల సన్మానం
కై లాస్‌నగర్: భీంపూర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు సోమవారం కలెక్టర్ రాజర్షిషాను కలిసి విన్నవించారు. ఇందుకు అనుకూలమైన గ్రామాలను పరిశీలించిన అధికారులు మండల కేంద్రంలో సోయా ఇతర పంటల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన మండల రైతులు గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజర్షి షా ను కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలి పారు. అలాగే పత్తిలో తేమ శాతం నిబంధనను సడలించి ఆదుకోవాలని కోరారు. అధ్వానంగా మారిన కరంజి–టీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కో రుతూ వినతిపత్రాలు అందజేశారు. ఇందుకు సా నుకూలంగా స్పందించిన కలెక్టర్ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టేలా సత్వరం చర్యలు తీసుకుంటా మని భరోసానిచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ప్రకాశ్‌యాదవ్, జీ నరేందర్, కపిల్, శేఖర్, మహేందర్, ప్రవీణ్, రమేశ్ తదితరులున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
