 
															విదేశీ పర్యటనకు ముగ్గురు టీచర్లు
ఆదిలాబాద్‌టౌన్: వృత్తిపరమైన సామర్థ్యాలను పెంపొందించి, అంతర్జాతీయ బోధనపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులను విదేశీ ప ర్యటనకు తీసుకెళ్తోంది. ఇందుకోసం ఇద్దరు పీ జీహెచ్‌ఎంలు, 10మంది స్కూల్ అసిస్టెంట్లు, ఒకరు ఎస్జీటీ దరఖాస్తు చేసుకున్నారు. ఏడు అంశాలకు సంబంధించి ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత ముగ్గురిని ఎంపిక చేశారు. ప్రధానోపాధ్యాయుల విభాగంలో జెడ్పీఎస్‌ఎస్ ధ నోర(బీ)కు చెందిన సీహెచ్ రాజు, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జైనథ్ మోడల్ స్కూల్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ఎల్.రాము, ఎస్జీటీ విభాగంలో ఇంద్రవెల్లి మండలంలోని ఏమైకుంట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు బీ గంగయ్యను ఎంపిక చేసినట్లు వి ద్యాశాఖ సెక్టోరల్ అధికారి అజయ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 మందిని నాలుగు బృందాలుగా తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. సింగాపూర్, వియత్నాం, పిన్‌లాండ్, జపాన్‌లో ఐదురోజుల పాటు పర్యటిస్తారని తెలిపారు.
 
							విదేశీ పర్యటనకు ముగ్గురు టీచర్లు
 
							విదేశీ పర్యటనకు ముగ్గురు టీచర్లు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
