 
															ఇందిరమ్మా.. ఇదేం తీరు?
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇంటి బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం చేసిన మార్పులు లబ్ధిదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి. విడతల వారీగా వారి కిచ్చే రూ.5లక్షల్లో రూ.60వేలను ఉపాధిహామీ ద్వా రా చెల్లిస్తామని ప్రకటించింది. ఏడాదికి సంబంధించిన కూలీల పనిదినాలకు ప్రభుత్వం చెల్లిస్తామన్న నగదుకు ఏమాత్రం పొంతన లేదు. మరోవైపు ఆది లాబాద్ మున్సిపల్ పరిధిలో ఉపాధిహామీ పథకం అమలు కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లబ్ధి దారులకు ఎలా బిల్లులు చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. స్లాబ్ లెవెల్‌లో ఇచ్చే నగదును తగ్గించడంతో ఇంటి తుది నిర్మాణ పనులను ఎలా పూర్తి చే యాలంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. ఇందిర మ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం నా లుగు విడతల్లో ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించింది. బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, రూప్‌లెవెల్‌లో మరో రూ.లక్ష, స్లాబ్ లెవెల్‌లో రూ.2లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష చొప్పు న లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని నిర్ణయించింది. అయితే, ఇటీవల స్లాబ్ లెవెల్‌లో జమ చేసే రూ.2లక్షల నిధుల విడుదలలో స్వల్ప మార్పులు చేసింది. రూ.2లక్షలకు గాను రూ.1.40లక్షలే లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. మిగతా రూ.60వేలను ఈజీఎస్ నుంచి విడుదల చే స్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 27న ప్రకటించారు. మంత్రి ప్రకటించిన రోజే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమవుతోంది. కాగా, రూ.60వేలు తగ్గించి జమ చేయడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
రూ.60వేలు చెల్లించేదెలా?
స్లాబ్ లెవెల్‌లో ఇవ్వాల్సిన బిల్లులో ప్రభుత్వం రూ.60వేలు కోత విధించింది. ఈ మొత్తాన్ని లబ్ధి దారులకు ఎలా చెల్లిస్తారనే అంశం ఆందోళనకు గురిచేస్తోంది. జాబ్‌కార్డు కలిగిన లబ్ధిదారులకు తమ ఇంటి వద్ద నిర్మాణ పనులు చేసుకున్నందుకు 90రోజుల పనిదినాలు లెక్కించి నగదు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రోజుకు రూ.307 చొప్పున 90రోజులకు గాను రూ.27,630 మాత్రమే అవుతుంది. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి స్వచ్చ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) ద్వారా రూ.12వేలు అందించనుంది. ఈ రెండింటి నగదు కలిపితే రూ.39,630 అవుతుంది. ఇంతవరకు భాగానే ఉండగా మరో రూ.20,370 నగదును ఏ ప్రాతిపదికన చెల్లిస్తారనేది తెలియడం లేదు. దీంతో ఆ నగదు తమకెలా అందుతుందనేదానిపై స్పష్టత లేక ఆయోమయానికి గురవుతున్నారు. కోత విధించకుండా రూ.60వేలు జమ చేసినట్లయితే ఇంటి ప్లాస్టరింగ్, ఇతర పనులు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉండేదని చెబుతున్నారు. పాత విధానంలోనే నగదు జమ చేయాలని కోరుతున్నారు.
‘ఇందిరమ్మ’ జిల్లా సమాచారం
మార్కౌట్ ఇచ్చినవి 9,187
బేస్మెంట్ లెవల్‌లో.. 4,397
రూప్ లెవెల్‌లో.. 1,407
రూప్ కంప్లీటెడ్ 477
పూర్తయిని ఇళ్లు 6
ఆందోళన అవసరంలేదు
ఇందిరమ్మ లబ్ధిదారులు రూ.60వేల నగదు కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాఽధిహామీ, ఎస్‌బీఎం ద్వారా వాటిని జమ చేయనుండగా, పట్టణ ప్రాంతాల లబ్ధిదా రులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు జమ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5లక్షలు జమ చేస్తుంది. ఆందోళన చెందకుండా ఇంటి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి.
– ఎండీ అబ్దుల్ షాకీర్,
ఇన్‌చార్జి హౌసింగ్ పీడీ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
