శిశు మరణాలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

శిశు మరణాలు తగ్గించాలి

Oct 31 2025 7:59 AM | Updated on Oct 31 2025 7:59 AM

శిశు మరణాలు తగ్గించాలి

శిశు మరణాలు తగ్గించాలి

● కలెక్టర్‌ రాజర్షిషా ● వైద్యులకు ప్రశంసాపత్రాలు

ఆదిలాబాద్‌టౌన్‌: శిశు మరణాలను తగ్గించేందుకు వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్‌ రాజర్షిషా సూచించారు. డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో ఐసీఎంఆర్‌ సంకల్ప్‌ కార్యక్రమానికి సంబంధించి వైద్యాధికారులు, స్టాఫ్‌ నర్సులు, పీడియాట్రిక్‌ వైద్యులు, ఎస్‌ఎంసీ యూ వైద్యులు, సిబ్బందికి ఇస్తున్న మూడురోజుల శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా వై ద్యులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో శిశు మరణా ల రేటు 13శాతం ఉండగా, 10 శాతం కంటే తక్కువగా నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు. నవజాత శిశు మరణాలు లేకుండా చూడాలని పే ర్కొన్నారు. ఏయిమ్స్‌ బీబీనగర్‌ వైద్యులు తన్నిగై నాథన్‌, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, రిమ్స్‌ పీడియాట్రిక్‌ హెచ్‌వోడీ హేమలత, ఎస్‌ఎంసీయూ నోడల్‌ అధికారి అనంత్‌రావు పాల్గొన్నారు.

‘ఇందిరమ్మ’ కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు

కైలాస్‌నగర్‌: సొనాల మండలం కౌఠ గ్రామ ఇందిరమ్మ లబ్ధిదారుడిపై దాష్టీకం ప్రదర్శించిన కాంట్రాక్టర్‌పై కఠినచర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ రాజర్షి షా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బాధ్యుడిపై బోథ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ హౌసింగ్‌ పనుల నుంచి తొలగించి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు తెలిపారు. సదరు కాంట్రాక్టర్‌ చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను నిలిపివేసి ఇ తర మేసీ్త్రల ద్వారా పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు, సందేహాలుంటే లబ్ధిదారులు తహసీల్దార్‌, ఎంపీడీవో, హౌసింగ్‌ ఏఈని సంప్రదించాలని సూచించారు.

సమన్వయంతో పని చేయాలి

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఈఎంఆర్‌ఎస్‌ ప్రి న్సిపాల్‌లు, అధికారులతో జిల్లా స్థాయి కమిటీ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉట్నూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి పా ఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన వసతులు కల్పించాలని సూ చించారు. పాఠశాలల్లో సెల్‌ టవర్స్‌ ఏర్పాటు చేసి డిజిటల్‌ క్లాసులు, ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల్లో భాష, గణిత నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నేషనల్‌ యూనిటీడే నిర్వహించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది ‘నశా ముక్త భారత్‌’ ప్ర తిజ్ఞ చేయాలని సూచించారు. ప్రతీ విద్యార్థి హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయాలని, సుమారు 480మంది విద్యార్థులకు ఆర్‌బీఎస్‌కే టీమ్‌ల ద్వారా వైద్యపరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలి పారు. ఆరోగ్య సమస్యలున్నవారిని నిరంతరం ప ర్యవేక్షించాలని, అత్యవసర సమయాల్లో అంబులె న్స్‌ సేవలు అందుబాటులో ఉంచాలని సూచించా రు. ట్రెయినీ కలెక్టర్‌ సలోని చబ్రా, ఐటీడీఏ డిప్యూ టీ డైరెక్టర్‌ అంబాజీ, డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, డీ ఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, డీఐఈవో గణేశ్‌జాద వ్‌, భూగర్భ జలశాఖ అధికారి శ్రీవల్లి, ప్రిన్సిపాల్‌ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement