నవజాత శిశు మరణాలు తగ్గించాలి
కై లాస్‌నగర్: జిల్లాలో నవజాత శిశు మరణాలు తగ్గించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వై ద్యారోగ్యశాఖ అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఐసీఎంఆర్ సంకల్ప్‌లో భా గంగా జిల్లాలో నవజాత శిశు మరణాల రేటు 10 కంటే తక్కువ వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. పో షకాహార లోపం, సకాలంలో వైద్యసేవలు అందకపోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించా లన్నారు. ప్రతీ పీహెచ్‌సీ, సబ్‌సెంటర్ స్థాయిలో తల్లుల ఆరోగ్యస్థితి, హిమోగ్లోబిన్ స్థాయి, ఆహా రపు అలవాట్లు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ వాడకం, పో షకాహార పంపిణీ వంటి అంశాలను సమీక్షించి రిస్క్ కేసుల జాబితా తయారు చేయాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ సి బ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, వైద్యులు అనంత్‌రావ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలి
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎంఆర్ సరఫరా ప్రగతిపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. సన్నబియ్యం మిల్లింగ్, సరఫరా పనులను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలన్నారు. లేకుంటే ఆర్‌ఆర్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. 2023–24 సీజన్‌కు సంబంధించిన మిగిలిన నాన్ అకౌంటెడ్ మిల్లర్ల వద్ద ఉన్న సన్నబియ్యాన్ని తక్షణమే సరఫరా చేయాలని ఆదేశించారు. డిసెంబర్ చివరి నాటికి వందశాతం సరఫరా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మిల్లర్లు ప్రతీవారం తమ సరఫరా పురోగతిపై యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఇందులో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా సివిల్ సప్లై అధికారి నందిని, డీఎం సుధారాణి తదితరులు పాల్గొన్నారు.


