కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ధర్నా
కై లాస్‌నగర్: పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబ ర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా కన్వీనర్ నిఖిల్ మాట్లాడుతూ, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుద ల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల ను చదువుకు దూరం చేస్తుందని ఆరోపించారు.అనంతరం అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో నాయకులు అరుణ్, మనీష్, అభిరాం, సాయి పాల్గొన్నారు.


