వర్షాలతో నష్టపోయాం..
ఈ ఏడాది 20 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. అధిక వర్షాలతో పంట చాలా వరకు దెబ్బతింది. దిగుబడి ఎకరానికి 4 క్వింటాలు మించడం లేదు. పెట్టుబడి రూ.5లక్షల వరకు అయ్యింది. ఈరోజు యార్డుకు 35 క్వింటాళ్ల వరకు పత్తిని తీసుకొచ్చాను. రెండో తీత పత్తి తీయడం గగనమే అనిపిస్తంది. సీసీఐ అధికారులు తేమ పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 12 శాతం మించితే కొనుగోలు చేయమని చెప్పడం సరికాదు. ప్రభుత్వం, అధికారులు ఈ విషయంలో చొరవ చూపాలి. ఇప్పుడున్న పరిస్థితులో సహజంగానే పత్తిలో తేమ 20 శాతం
మించి ఉంటుంది. – దత్తు, రైతు, కుచులాపూర్
తేమ కొర్రీలు పెట్టొద్దు..
నేను 18 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. మార్కెట్‌కు 40 క్వింటాళ్ల వరకు తీసుకొచ్చాను. తేమను పరిశీలించగా 20 శాతంగా నమోదైంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో తేమ ఎక్కువగానే ఉంటుంది. 12 శాతం వరకు సీసీఐ అధికారులు ఎలాంటి కోత విధించొద్దు. 20 శాతం వరకు ఉన్నా కొనుగోలు చేయాలి. ఈసారి పెట్టుబడి కూడా చేతికి అందడం గగనంగా ఉంది. గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే నిండా మునిగే పరిస్థితి.
– అమరేందర్, రైతు, నిపాని
వర్షాలతో నష్టపోయాం..


