అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
కైలాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటిని పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ఇందులో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏవో వర్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..


