రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ధర్నా
కై లాస్‌నగర్: ఉద్యోగ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసో సియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఆందో ళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎస్. సుధాకర్ మాట్లాడుతూ, మార్చి 2024లో రిటైర్మెంటైన ఉద్యోగులకు ఇప్పటివరకు బెని ఫిట్స్ రాలేదన్నారు. 18 నెలలుగా పెండింగ్‌లో ఉంచడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు పే ర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చ ర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో అసోసియేషన్ ప్రధానకార్యదర్శి మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, బాపురావు, శ్రీరాం, గణపతి, రాజకిశోర్ తదితరులు పాల్గొన్నారు.


