పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంభన
తేమ విషయంలో వెనక్కి తగ్గని సీసీఐ రైతుల ఆందోళన మధ్యాహ్నం వరకు నిలిచిన కొనుగోళ్లు ప్రైవేట్ వ్యాపారులను ఒప్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే తేమతో సంబంధం లేకుండా ఒక్కరోజు రూ.6,950 ఖరారు
ఆదిలాబాద్‌టౌన్: ఆరుగాలం కష్టపడి పంట పండించినా రైతులకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. ఎకరానికి కనీసం 5 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఇటీవల కు రిసిన అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట తడిసి ముద్దవుతుంది. మరోవైపు తేమ పేరిట సీసీఐ నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.6,950 ధర చెల్లించేందుకు ముందుకు వచ్చినా గిట్టుబాటు కా వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యార్డుకు తీసుకొచ్చిన పత్తిని ఇంటికి తీసుకెళ్లే ప రిస్థితి లేకపోవడంతో తక్కువ ధరకే విక్రయించి న ష్టాలను చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.
తొలి రోజు కొనుగోళ్ల తీరిది..
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొంది. ఏటా మాదిరిగా ఈసారి కూడా రైతులు ఆందోళన బాట పట్టారు. సోమవా రం ఉదయం 9 గంటలకు యార్డులో పత్తి కొనుగో ళ్లను మార్కెటింగ్ అధికారులు వేలం ద్వారా నిర్వహించారు. సీసీఐ అధికారులు మద్దతు ధర రూ. 8,110తో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చా రు. ప్రైవేట్ వ్యాపారులు రంగంలో ఉన్నప్పటికీ మొదట రూ.6,500తో వేలం పాడారు. ఆ త ర్వాత రూ.10, రూ.20 పెంచుతూ రూ.6,950 వద్ద నిలిపివేసి ధర నిర్ణయించారు. ఈ ధర కూడా 8 శా తం తేమ ఉంటేనే చెల్లిస్తామని ప్రైవేట్ వ్యాపారులు ని బంధన విధించారు. ఇక సీసీఐ రెండు మూడు పత్తి బండ్లను కొనుగోలు చేసింది. కొంత మంది రై తుల బండ్లలో 7 నుంచి 13 శాతం వరకు తేమ ఉండగా, చాలామంది బండ్లలో 20 శాతం నమోదైంది.దీంతో 12శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని సీసీఐ స్పష్టం చేసింది. దీంతో రైతులు 1వ నంబర్ కాంటా వద్ద ఆందోళనకు దిగారు. వాతావరణ పరిస్థితులతో సహజంగానే 20 శాతం మించి తేమ ఉంటుందని, దీనికితోడు వర్షాలు కురుస్తున్నాయని రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి,ఆర్డీవో స్రవంతి మార్కెట్ యార్డు కు చేరుకున్నారు. రైతులు, సీసీఐ అధి కారులతో మాట్లాడారు. అయితే 12 శాతం మించి తేమ ఉంటే కొనుగోలు చేయమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో రైతులు ఆందోళనకొనసాగించారు. ఆ తర్వా త ఎమ్మెల్యే పాయల్ శంకర్ మార్కెట్ యార్డుకు చే రుకున్నారు. రైతులను ఒప్పించే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అన్నారు. 12 శాతం వరకు ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 15 నుంచి 20 శాతం వరకు ధరలో కోత విధించినా విక్రయిస్తామని రైతులు పేర్కొన్నారు. సీసీఐ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. పత్తి బండ్లలో తేమ శాతాన్ని పరిశీలించగా, పలు బండ్లలో 18 నుంచి 20 శాతం వరకు నిర్ధారణ అయ్యింది. కొన్ని బండ్లలో 12 శా తం లోపు నమోదైంది. ఆ తర్వాత ఎమ్మెల్యే అక్కడినుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సీసీఐ అధికారులు, ప్రైవేట్ వ్యాపారులతో సమావేశం నిర్వహించా రు. నిబంధనలను సడలించేదిలేదని సీసీఐ అధికా రులు స్పష్టంచేశారు. ప్రైవేట్ వ్యాపారులను ఒప్పిం చి మొదటిరోజు నిర్ణయించిన ధర రూ.6,950తో కొనుగోలు ప్రారంభించారు. ఒక్కరోజు మాత్రమే ఈ ధరతో కొనుగోలుచేస్తామని వ్యాపారులు ఒప్పుకున్నారు. కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే శంకర్ మా ర్కెట్ యార్డుకు వెళ్లి విషయాన్ని రైతులకు తెలియజేశారు. అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత కొ నుగోళ్లు ప్రారంభమయ్యాయి. తేమ శాతం తక్కువగా ఉన్న రైతులు సీసీఐకి విక్రయించుకోగా, ఎక్కువగా ఉన్న వారు ప్రైవేట్ వ్యాపారులకు పంటను విక్రయించారు. మొదటిరోజు 600 వరకు పత్తి బండ్లు యార్డుకు వచ్చాయి. ఇదిలా ఉండగా సీసీఐ 8 శాతం తేమ ఉన్న రైతులకు రూ.8110 చెల్లించగా, ఆ తర్వాత 12శాతం వరకు తేమ ఉంటే క్వింటాలుకు కిలో చొప్పున ధరలో కోత విధించారు.
సీసీఐ పత్తి మద్దతు ధర క్వింటాలుకు : రూ.8,110
మొదటిరోజు ప్రైవేట్ వ్యాపారుల ధర : రూ.6,950
మార్కెట్‌కు వచ్చిన పత్తి బండ్లు : 600


